airplane: ఉడాన్‌ పథకం కింద అతి తక్కువ ధరలకే విమాన టికెట్లు

షార్ట్స్‌లో చూడండి
ఉడాన్‌ పథకం కింద నడిపే విమానాల టికెట్లపై జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తాము నడపనున్న మార్గాలను తెలిపింది. పాట్నా-అలహాబాద్‌-పాట్నా మార్గంలో టికెట్‌ ధర రూ.1216గా నిర్ణయించింది. అలాగే నాగ్‌పూర్‌-అలహాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో రూ.1690, ఇండోర్‌-అలహాబాద్‌-ఇండోర్‌ మార్గంలో ధర రూ.1914, ఢిల్లీ-నాసిక్‌-ఢిల్లీ విమాన టికెట్‌ ధర రూ.2,665లకే ఇస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్‌ పేర్కొంది.

అలాగే, ధర రూ.967తో లక్నో-అలహాబాద్‌-పాట్నా మార్గంలో ప్రయాణించవచ్చని పేర్కొంది. కాగా, తక్కువ ధరలకే విమాన టిక్కెట్లు అందించాలన్న ఉద్దేశంతో భారత సర్కారు ఉడాన్‌ పథకంను ప్రారంభించి, 325 రూట్లను పలు విమానయాన సంస్థలకు కేటాయించింది.
Go Back to Shorts
airplane
india
rates

More Telugu News