siddaramiah: మాకు 118 మంది సభ్యుల సంఖ్యా బలం ఉంది: సిద్ధరామయ్య

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జేడీఎస్‌-కాంగ్రెస్‌ పార్టీల నేతలు ఈ రోజు గవర్నర్‌కు లేఖ రాసి అపాయింట్‌మెంట్‌ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం ఇరు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసి కాసేపు చర్చలు జరిపారు. అనంతరం జేడీఎస్‌-కాంగ్రెస్‌ నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ... తమకు 118 మంది సభ్యుల సంఖ్యా బలం ఉందని, ఇరు పార్టీల నేతలం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరామని తెలిపారు.

తమ మద్దతును జేడీఎస్‌ అంగీకరించిందని, కాంగ్రెస్‌ తీర్మానాన్ని లేఖ ద్వారా గవర్నర్‌కు వివరించామని అన్నారు. సంఖ్యాబలం ఆధారంగానే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించాలని తాము కోరామని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
Go Back to Shorts
siddaramiah
Congress
Karnataka

More Telugu News