ఆనవాయతీ నిజమైంది... సిరాహట్టిలో గెలిచిన పార్టీకే రాష్ట్రం దక్కింది!

  • సిరాహట్టిలో విజయం సాధించిన పార్టీకే అధికారం
  • గత ఏడు ఎన్నికల్లో అదే పరిస్థితి
  • 2018లోనూ మారని సంప్రదాయం
సిరాహట్టి...  కర్ణాటకలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం. గతంలో జరిగిన ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ వారైతే ఇక్కడ గెలుస్తారో, ఆ అభ్యర్థిని నిలబెట్టిన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ మరోసారి నిజమైంది. కన్నడనాట పాత సంప్రదాయాన్ని నిజం చేస్తూ, సిరాహట్టిలో బీజేపీ అభ్యర్థి రామప్ప సోబెప్ప లమాని విజయం సాధించారు.

ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దొడ్డమణి రామకృష్ణ సిద్ లింగప్ప పై విజయం సాధించారు. 2013లో జరిగిన ఎన్నికల్లో సోబెప్పపై సిద్ లింగప్ప విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విజయలక్ష్మి వరించిన సోబెప్పను నిలబెట్టిన బీజేపీ అధికారాన్ని చేపట్టనుంది. సిరాహట్టి పోలిక కాకతాళీయమే అయినా, కన్నడిగులతో పాటు దేశమంతా దీని గురించి మరోసారి చర్చించుకునే అవకాశం ఏర్పడింది.
Go Back to Shorts
Sirahatti
Karnataka
BJP
Congress
Elections

More Telugu News