ballary: బళ్లారిలో సెక్షన్ 144 విధింపు

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించబోతోంది. మరోవైపు, గాలి సోదరుల అడ్డా అయిన బళ్లారి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతాచర్యల్లో భాగంగా 144 సెక్షన్ విధించినట్టు జిల్లా ఎస్సీ రంగరాజన్ తెలిపారు. బళ్లారి జిల్లాలోని మొత్తం 9 నియోజకవర్గాల్లో 19 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 74.13 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  
Go Back to Shorts
ballary

More Telugu News