Allu Arjun: క్యాప్ ట్రిక్స్ తో పడగొట్టేస్తోన్న బన్నీ .. ఒక రేంజ్ లో దూసుకెళ్తోన్న వీడియో!

షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్ కథానాయకుడిగా 'నా పేరు సూర్య ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో యాక్షన్ .. ఎమోషన్స్ లోనే కాదు, ఎప్పటిలానే డాన్సుల్లోను ఆయన ఎక్కువ మార్కులు కొట్టేశాడు. కథాకథనాలతో పాటు డాన్సుల్లోను ప్రత్యేకత వుండాలని ఆరాటపడే ఆయన, 'లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో' అనే పాటలో క్యాప్ తో కొన్ని విన్యాసాలు చేశాడు. చూడటానికి గమ్మత్తుగా అనిపించే ఆ విన్యాసాలు ఆయన ఫ్యాన్స్ ను మరింత ఖుషీ చేశాయి.

 క్యాప్ తో చేసే విన్యాసాలను గ్రాఫిక్స్ తో చేయిద్దామని వక్కంతం వంశీ అన్నాగానీ, అలా వద్దని చెప్పేసి .. బన్నీ రెండు నెలల పాటు ప్రాక్టీస్ చేసి .. ఆ పాటలో చేశాడట. ఇదే విషయాన్ని దర్శకుడు వక్కంతం వంశీ కూడా ఈ సినిమా ఫంక్షన్ లో చెప్పాడు. క్యాప్ తో బన్నీ ప్రాక్టీస్ కి సంబంధించిన వీడియోను ఈ సినిమా విడుదలకి ముందే రిలీజ్ చేశారు. ఈ వీడియోను ఇంతవరకూ 25 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం.
Go Back to Shorts
Allu Arjun

More Telugu News