'మహానటి' సినిమాపై సావిత్రి కుమార్తె, అల్లుడి స్పందన
- చిన్నతనం నుంచి అగ్రనటిగా ఎదిగిన తీరును ఈ సినిమాలో చూశా
- కీర్తి సురేష్ ను అమ్మే స్వయంగా ఎంచుకుందనిపిస్తోంది
- అమ్మ కథను తెరకెక్కించడం సంతోషంగా ఉంది
సావిత్రి అల్లుడు గోవింద్ మాట్లాడుతూ, సావిత్రిని మించిన నటి లేదని అందరూ అంటుంటారని... సావిత్రిని మించిన నటి రావాలని తాను అనుకుంటూ ఉంటానని చెప్పారు. 'మహానటి' చిత్రం ద్వారా తన కోరిక వాస్తవరూపం దాల్చిందని, సావిత్రిని మించి కీర్తి సురేష్ నటించిందని తెలిపారు. సావిత్రి జీవిత చరిత్రతో సినిమా రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు.