Catherin: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • కొత్త డ్యాన్స్ నేర్చుకుంటున్న కేథరిన్ 
  • మెగాస్టార్ తో కొరటాల శివ!
  • చైనాలో 'బాహుబలి 2' వసూళ్లు
  • సుమంత్ 'సుబ్రహ్మణ్యపురం'    

*  అందాల కేథరిన్ ప్రస్తుతం కొత్త తరహా డ్యాన్స్ నేర్చుకుంటోంది. ఇటీవల హాలిడే కోసం అమెరికా వెళ్లిన ఈ చిన్నది, పాప్యులర్ డ్యాన్సర్ మిస్ వీ వద్ద రెండు వారాల క్రాష్ కోర్సు కోసం జాయిన్ అయింది. పాపింగ్ అండ్ లాకింగ్ స్టయిల్ డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంటోంది.
*  తాజాగా 'భరత్ అనే నేను' చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ త్వరలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల చిరంజీవికి శివ ఓ కథ చెప్పాడని, అది నచ్చడంతో డెవలప్ చేయమని చిరంజీవి చెప్పారని సమాచారం.
*  ప్రపంచ వ్యాప్తంగా సంచలన వసూళ్లు రాబట్టిన 'బాహుబలి 2' చిత్రం ప్రస్తుతం చైనాలో కూడా విజయవిహారం చేస్తోంది. గత శుక్రవారం సుమారు 7000 థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మూడు రోజుల్లో సుమారు 51 కోట్లు వసూలు చేసింది.  
*  సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రం రూపొందుతోంది. ఈషా నాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.    

More Telugu News