తన మనవడి పుట్టినరోజు వేడుకల్లో రజనీకాంత్‌.. ఫొటోలు వైరల్‌

  • ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన రజనీ
  • పెద్ద కూతురి చిన్న కుమారుడి పుట్టినరోజు వేడుక
  • ఫొటోలు పోస్ట్ చేసిన సౌందర్య రజనీకాంత్‌
సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన విషయం తెలిసిందే. నిన్న తన మనవడు వేద్‌ కృష్ణ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తన కుమారుడి పుట్టిన రోజు వేడుకల ఫొటోలను రజనీ చిన్న కుమార్తె సౌందర్య ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. మూడేళ్ల క్రితం ఈ ఏంజిల్‌ తన జీవితంలోకి వచ్చాడని, తన బేబీ బర్త్‌ డే సందర్భంగా కుటుంబంతో వేడుకలు జరుపుకుంటున్నామని పేర్కొంది.

ఈ పుట్టినరోజు వేడుకల్లో రజనీకాంత్‌ పెద్ద కూతురు, అల్లుడు ఐశ్వర్య, ధనుష్‌ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరూ వేద్‌ కృష్ణను ఎత్తుకుంటూ ఫొటోలు దిగారు. సౌందర్య చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్‌ రామ్‌కుమార్‌ను 2010లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకోగా వారి కుమారుడు సౌందర్య వద్దే ఉంటున్నాడు.    
Go Back to Shorts
photos
Rajinikanth
Twitter

More Telugu News