వాట్సప్‌లో ఆ తరహా మెసేజ్‌లను క్లిక్ చేస్తే ప్రమాదమేనంటోన్న నిపుణులు!
- బ్లాక్ పాయింట్‌ను టచ్ చేస్తే మీ వాట్సప్ హ్యాంగ్
- కొన్ని సార్లు స్మార్ట్‌ఫోన్‌లు కూడా
- ఈ మధ్య కాలంలో బాగా ఫార్వర్డ్ అవుతోన్న మెసేజ్
ఒకవేళ ఆ లింకుని క్లిక్ చేస్తే కంప్యూటర్ లేక స్మార్ట్‌ఫోన్‌లు హ్యాకింగ్‌కు గురవుతాయి. ఇప్పుడు అటువంటి వాటిపై చాలా మంది నెటిజన్లకు అవగాహన వచ్చింది. దీంతో ఇప్పుడు కేటుగాళ్లు తమ రూటు మార్చి మరో విధమైన మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ బ్లాక్ పాయింట్‌ను లేక ఎమోజీని టచ్ చేసి చూడండంటూ మెసేజ్‌లు పంపి మన స్మార్ట్‌ఫోన్లు హ్యాంగ్ అయ్యేలా చేస్తున్నారు.
అలాగే, 'ఇది చాలా ఆసక్తికరంగా ఉంది' అంటూ ఓ మెసేజ్ పంపుతున్నారు. దాని పక్కనే నవ్వుతున్న ఎమోజీతో పాటు రీడ్ మోర్ అని ఉంటోంది. దాన్ని టచ్ చేసినా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇటువంటి మెసేజ్‌లు ఈ మధ్య కాలంలో బాగా ఫార్వర్డ్ అవుతున్నాయి. వాటిపై క్లిక్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి మెసేజ్‌లలో అదృశ్యంగా కొన్ని సింబల్స్ ఉంటాయని అంటున్నారు.