Narendra Modi: అనుకున్నదొకటి అయినదొకటి.. మోదీ తల్లి మార్ఫింగ్‌ ఫొటోను పోస్ట్‌ చేసిన కేంద్ర మంత్రిపై విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
మన ప్రియతమ ప్రధానమంత్రి తల్లి హీరాబెన్ మోదీ ఇప్పటికీ ఆటోలోనే ప్రయాణిస్తున్నారంటూ కేంద్ర మంత్రి విజయ్‌ సంపాలా తన ట్విట్టర్‌ ఖాతాలో అందుకు సంబంధించి ఓ మార్ఫింగ్‌ ఫొటోను పోస్ట్ చేసి నరేంద్ర మోదీ చాలా గొప్పవారంటూ చాటి చెప్పాలనుకున్నారు. అయితే, అది మార్ఫింగ్‌ ఫొటో అని సులువుగా గుర్తు పట్టిన నెటిజన్లు విజయ్‌ సంపాలాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఈ ఫొటోతో మోదీ కుటుంబం సాధారణ ప్రజల్లా బతుకుందని చాటి చెప్పాలనుకోవడమే కాకుండా రాహుల్‌ గాంధీ తల్లి సోనియా గాంధీపై సదరు కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. ఆమె ప్రపంచంలోనే ధనిక నేతల్లో నాలుగో స్థానంలో ఉన్నారని అన్నారు.  

విజయ్‌ సంపాలా పోస్ట్ చేసిన ఫొటోలో మోదీ తల్లి హీరాబెన్‌ కుడి మోచేతిని గమనిస్తే ఆమె చేతిని పట్టుకున్నట్లు మరో చేయి కనపడుతోంది. మరోవైపు, ఆ ఫోటో నిజమైతే.. మోదీ కనీసం తల్లిని కూడా పట్టించుకోవట్లేదా? అని కొందరు విమర్శిస్తున్నారు. 
Go Back to Shorts
Narendra Modi
Twitter
Prime Minister

More Telugu News