Chandrababu: చంద్రబాబులో మరో అల్లూరి సీతారామరాజుని చూస్తారు!: వైసీపీకి బుద్దా వెంకన్న హెచ్చరిక

షార్ట్స్‌లో చూడండి
దాచేపల్లిలో అత్యాచార ఘటన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలపై రోజా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రోజా చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. సీఎం చంద్రబాబునాయుడిపై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని వైసీపీ నేతలను టీడీపీ నేత బుద్దా వెంకన్న హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘చంద్రబాబుగారు శాంతమూర్తిగా ఉన్నప్పుడు మహాత్మాగాంధీ లాంటి వారు. ఆయన (చంద్రబాబు) కు గానీ నిజంగా కోపం వచ్చి మీ (వైసీపీ) చేష్టలు పరాకాష్టకు వెళితే.. చంద్రబాబునాయుడి గారిలో మరో అల్లూరి సీతారామరాజుని చూస్తారు! చంద్రబాబునాయుడు గారేమీ సామాన్య వ్యక్తి కాదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని మీ (వైసీపీ) మీద ఉపయోగించట్లేదు’ అని హెచ్చరించారు. 
Go Back to Shorts
Chandrababu
YSRCP
budda venkanna

More Telugu News