ఎమ్మెల్యే అదితి సింగ్ తో రాహుల్ గాంధీకి పెళ్లి... వైరల్ అవుతున్న వార్త.. ఖండించిన ఎమ్మెల్యే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎమ్మెల్యే అదితి సింగ్ తో రాహుల్ గాంధీకి పెళ్లి... వైరల్ అవుతున్న వార్త.. ఖండించిన ఎమ్మెల్యే!

  • రాహుల్ కు ఈ నెలలోనే వివాహం
  • దేశవ్యాప్తంగా వైరల్ అయిన వార్త
  • రాహుల్ నాకు అన్నలాంటి వారు
  • స్పష్టం చేసిన అదితి సింగ్
రాహుల్ గాంధీకి ఈ నెలలోనే వివాహం జరగనుందని, రాయ్ బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్ ను ఆయన పరిణయం ఆడనున్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లపై అదితి తొలిసారి స్పందించారు. అన్నాచెల్లెళ్ల మధ్య వివాహం జరుగుతోందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఆమె, పుకార్లను వినగానే తన ప్రపంచం తలకిందులైనట్లు అనిపించిందని చెప్పారు. ఈ వార్తలో ఎటువంటి నిజమూ లేదని, తన చేత్తో రాఖీ కట్టిన రాహుల్ గాంధీ, తనకు అన్నయ్యని, ఈ పుకార్లతో తాను చాలా బాధపడ్డానని అన్నారు.

కాగా, రాయ్ బరేలీలోని వాట్స్ యాప్ గ్రూపుల నుంచి ఈ పుకార్లు ప్రారంభం కాగా, దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఇక అదితి సింగ్, రాయ్ బరేలీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలేష్ సింగ్ కుమార్తె. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. యూఎస్ లోని డ్యూక్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె, గత ఎన్నికల్లో 90 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రియాంకా గాంధీకి అదితి సన్నిహితురాలు కూడా. అందువల్లే ఆమెకు, రాహుల్ కు ఆమెతో వివాహమంటూ ఎవరో పుకార్లు సృష్టించారు.
Rahul Gandhi
Marriage
Aditi Singh
Rai Barelli

More Telugu News