cuddapah: కడపలో దారుణం.. బాలికపై ఇంటర్ విద్యార్థుల అత్యాచారం!

షార్ట్స్‌లో చూడండి
దాచేపల్లి ఘటన మరువకముందే కడప జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇంటర్ మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలు.. బద్వేల్ మునిసిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీకి చెందిన ఓ బాలికపై ఇంటర్ మీడియట్ చదువుతున్న విద్యార్థులు రమేష్, కృష్ణ .. ముళ్లపొదల్లోకి ఆ బాలికను ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన అనంతరం జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు బాధితురాలు చెప్పింది. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలించి వారిని అరెస్టు చేశామని, అత్యాచారానికి గురైన బాలికను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
Go Back to Shorts
cuddapah
intermediate studnents

More Telugu News