నిర్దేశించిన గడువులోగా ప్రపంచ బ్యాంకు పనులన్నీ పూర్తి చేయాలి: ఏపీ సీఎస్ దినేష్ కుమార్
- పలు శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులతో సమీక్షా సమావేశం
- నిధుల విడుదలలో జాప్యం జరిగితే నా దృష్టికి తీసుకురావాలి
- ప్రతినెలా కలెక్టర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆదేశం
తుపాన్ షెల్టర్లు, విశాఖలోని కైలాసగిరి, బీచ్ ప్రాంతాల అభివృద్ధి, నర్సరీల ఏర్పాటు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల కిందచేపట్టిన రోడ్డు నిర్మాణ పనులపై సమీక్షించారు. పోలీసు, విద్య, అగ్నిమాపక శాఖల్లో చేపట్టిన పనులపైనా చర్చించారు. ఉపాధి హామీ కింద అందజేసే మొక్కల పెంపకం వల్ల ఆదాయం వచ్చేలా చూడాలని దినేష్ కుమార్ ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యంలోగా పనులు చేయాలని ఆయా శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. నిధుల విడుదలలో జాప్యం చోటుచేసుకుంటే తన దష్టికి తీసుకురావాలని, ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇందుకోసం ప్రతినెలా కలెక్టర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని, నెలవారీ రిపోర్టులు తయారు చేయాలని ఆదేశించారు.