యూపీలో 64 మంది మృతి చెందారు.. ఆ రాష్ట్ర సీఎం కర్ణాటకలో ఉన్నారు: సిద్ధరామయ్య
- కుంభవృష్టి కారణంగా యూపీ ప్రజల ఇబ్బందులు
- యూపీ సీఎం కర్ణాటకలో ఉండాల్సి వస్తోంది
- ఆయన వెళ్లి చేయాల్సిన పనులు చేస్తారని ఆశిస్తున్నాను
'కుంభవృష్టి కారణంగా ఉత్తరప్రదేశ్‌లో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కర్ణాటకలో ఉండాల్సి వస్తోంది. ఆయన త్వరలోనే ఉత్తరప్రదేశ్‌కి వెళ్లి చేయాల్సిన పనులను చేస్తారని ఆశిస్తున్నాను' అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.