KCR: మా కూరల్లో కారం ఎక్కువన్న కేటీఆర్.. అంత కారమేమీ లేదన్న అఖిలేష్!

షార్ట్స్‌లో చూడండి
జాతీయ రాజకీయాల్లో సంపూర్ణమైన మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో ఓ ఫ్రంట్ ను ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతు తెలిపేందుకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ కుమార్ యాదవ్ నిన్న హైదరాబాదుకు విచ్చేశారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయిన ఆయన... పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా అఖిలేష్ కోసం పసందైన విందును కేసీఆర్ ఏర్పాటు చేశారు.

మెనూలో ఉన్న ఐటెమ్స్... మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చేపల కూర, పప్పు, మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీ, రోటీ, తెల్ల అన్నం, సాంబారు, రసం, పచ్చళ్లు తదితర పదార్థాలను అఖిలేష్ కు వడ్డించారు. మామిడి పండ్ల ముక్కలను అఖిలేష్ ఇష్టంగా తిన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మా దగ్గర కారం కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీనికి సమాధానంగా... 'అంత కారంగా ఏమీ లేదు. వంటలు చాలా బాగున్నాయి' అంటూ కితాబిచ్చారు.  
Go Back to Shorts
KCR
KTR
akhilesh yadav
third front
dinner

More Telugu News