సమంత పోటీకి భారీగా స్పందన.. 'అహ నా పెళ్లంట' అంటూ డ్యాన్స్ చేస్తోన్న అమ్మాయిలు
- కొందరి డ్యాన్స్ వీడియోలను రీట్వీట్ చేసిన సమంత
- లవ్లీ అంటూ చప్పట్లు కొట్టిన శామ్
- 'అహనా పెళ్లంట' డ్యాన్స్ చేస్తూ పోటీ పడుతోన్న అమ్మాయిలు
వైజయంతి మూవీస్ వారి మహానటి ఫన్ ఛాలెంజ్ పేరిట మొదలైన ఈ పోటీకి మంచి స్పందన వస్తోంది. చాలా మంది అమ్మాయిలు ‘అహ నా పెళ్లంట.. ఓహో నా పెళ్లంట’ పాటకు డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను తీసి #celebrateSavitri ట్యాగ్‌చేసి ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. వాటిల్లో కొందరు చిన్నారులు చేసిన డ్యాన్స్ లు సమంతకి బాగా నచ్చాయి. వారి డ్యాన్స్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. లవ్లీ అంటూ కామెంట్ చేసి చప్పట్లు కొట్టింది.