గ్రేట్ వర్క్ రామ్ చరణ్: నారా లోకేష్ ప్రశంసల వర్షం

  • మూడు వారాల క్రితం విడుదలైన 'రంగస్థలం'
  • సినిమా చూసిన నారా లోకేష్
  • వండర్ ఫుల్ అంటూ ప్రశంసలు
మూడు వారాల క్రితం విడుదలై, బంపర్ కలెక్షన్లు సాధించిన రామ్ చరణ్ కొత్త చిత్రం 'రంగస్థలం' సినిమాను తిలకించిన ఏపీ ఐటీ, మంత్రి నారా లోకేష్, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, "థమ్స్ అప్ టూ రామ్ చరణ్, సుకుమార్ మరియు వారి చిత్రబృందం. 'రంగస్థలం' వంటి వండర్ ఫుల్ చిత్రాన్ని అందించారు. సినిమా చూసి వచ్చిన తరువాత కూడా చిత్రంలోని పాత్రలు మా వెన్నంటి వున్నాయి. గ్రేట్ వర్క్ గైస్" అని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Nara Lokesh
Ramcharan
Rangasthalam
Movie

More Telugu News