nagarjuna': నాగ్ తో సినిమా చేయాలనుకుంటోన్న తేజ

షార్ట్స్‌లో చూడండి
సురేశ్ ప్రొడక్షన్స్ లో వెంకటేశ్ హీరోగా ఒక సినిమా చేయాలని తేజ అనుకున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైపోయాయి. అయితే పూర్తి కథతో ఆయన సురేశ్ బాబును మెప్పించలేకపోయిన కారణంగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దాంతో వెంకటేశ్ మరో డైరెక్టర్ తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇక తేజ చేతిలో 'ఎన్టీఆర్' బయోపిక్ వుంది కదా దానిపై దృష్టి పెడతాడని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆయన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఇక తన దగ్గర ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో కొనసాగే ఒక కథ ఉండటంతో, దానిని నాగార్జునతో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన వున్నాడట. త్వరలో నాగ్ ను కలిసి కథను వినిపించడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
Go Back to Shorts
nagarjuna'
teja

More Telugu News