దోచేస్తున్న ఐఆర్సీటీసీ... ఆర్టీఐతో వెల్లడైన విస్తుపోయే వాస్తవం!
- టికెట్ రద్దుపైనా సర్వీస్ చార్జ్
- జూలై 1 నుంచి 11 రోజుల్లో రూ. 3 కోట్లకు పైగా సంపాదన
- లోక్ అదాలత్ లో కేసు విచారణ
‘రైల్వే కమర్షియల్ సర్క్యులర్ 43’ కింద జీఎస్టీ అమలు కంటే ముందే టికెట్ బుక్ చేసుకున్నా, జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత టికెట్ రద్దు జరిగిందని, దీనిపై సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయని, అందువల్ల రిఫండ్ చెయ్యాల్సిన అవసరం లేదని సమాధానం ఇచ్చింది. ఇక జీఎస్టీ అమలులోకి వచ్చిన జూలై 1 నుంచి జూలై 11 మధ్య ప్రయాణానికి టికెట్ కొని దాన్ని రద్దు చేసుకున్న వారి నుంచి రూ. 3.34 కోట్ల సర్వీస్ చార్జ్ లను ఐఆర్సీసీటీసీ వసూలు చేసింది. చాలా మంది ప్రయాణికులు ఈ బాదుడు విషయం తెలియదని, కొందరికి తెలిసినా విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సుజిత్ స్వామి వెల్లడించారు. దీనిపై లోక్ అదాలత్ ను సుజిత్ ఆశ్రయించగా, రైల్వే బోర్డుకు, పశ్చిమ మధ్య రైల్వేకు, ఐఆర్‌సీటీసీకి నోటీసులు జారీ అయ్యాయి.