Puducherry: ప్రజాగ్రహాన్ని చూసి ఆదేశాలు వెనక్కు తీసుకున్న కిరణ్ బేడీ!

  • బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలకే ఉచిత బియ్యం
  • కిరణ్ బేడీ ఆదేశాలతో వెల్లువెత్తిన ప్రజాగ్రహం
  • ఆదేశాలు వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటన

బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలకే ఉచిత బియ్యం అందించాలని తాను ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి వెనక్కు తగ్గారు. కొన్ని గ్రామాలను సందర్శించిన ఆమె, పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, స్థానిక ప్రజాప్రతినిధి, పంచాయతీ అధికారి నుంచి పౌర సరఫరాల కమిషనర్‌ కు తమ గ్రామం చెత్త, బహిరంగ మల విసర్జన రహితమని మే 31 లోగా లేఖ ఇవ్వాలని, అప్పుడే ఆయా గ్రామాలకు ఉచిత బియ్యాన్ని అందిస్తామని ఆమె చెప్పగా, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన ఆదేశాలను వెనక్కు తీసుకున్నారు.  జూన్‌ చివరి నాటికి పుదుచ్చేరిలోని అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన రహితంగా మారుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందునే లెఫ్టినెంట్ గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

More Telugu News