Tirumala: నెత్తురోడిన రహదారి... తిరుమలకు బయలుదేరి అనంత లోకాలకు!

షార్ట్స్‌లో చూడండి
గత రాత్రి చిత్తూరు జిల్లా పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు సేలం నుంచి తిరుమలకు టెంపోలో వస్తున్న ఓ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. పోలీసుల సమాచారం మేరకు, తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శనానికి 11 మందితో కూడిన ఓ కుటుంబం టెంపోలో బయలుదేరింది. పాకాల మండలం శ్రీనివాసపురం సమీపంలో ఈ టెంపోను నెల్లూరు నుంచి బెంగళూరుకు రొయ్యలు, చేపల లోడ్ తో వెళుతున్న వ్యాన్ ఢీకొంది.

ఈ ప్రమాదంలో కనిమొళి, లోథేష్, వెంకటాచలం అనే వారు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో వడివేలు, మౌనిషా, కవిప్రియ, నిత్యబేబీ, చంద్రల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, యాక్సిడెంట్ అయిన తరువాత దాదాపు రెండు గంటల పాటు అంబులెన్స్ రాలేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ యాక్సి్డెంట్ కారణంగా హైవేపై దాదాపు 5 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.
Go Back to Shorts
Tirumala
Road Accident
Chittoor District

More Telugu News