అల్లు శిరీష్ మూవీకి ముహూర్తం ఖరారు
- అల్లు శిరీశ్ హీరోగా 'ఏబీసీడీ'
- దర్శకుడిగా సంజీవ్ రెడ్డి
- ఈ నెల 30వ తేదీన లాంచ్
ఈ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన లాంచ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగును జరపనున్నారు. మధుర శ్రీధర్ .. యష్ రంగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన ఈ సినిమా, అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దుల్కర్ క్రేజ్ ను అమాంతంగా పెంచేసింది. మరి తెలుగులో ఈ సినిమా శిరీష్ కి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.