Jana Sena: గుంతకల్లు: జనసేన సమావేశంలో ఉద్రిక్తత.. పవన్ ఫ్యాన్స్ రచ్చ!

షార్ట్స్‌లో చూడండి
అనంతపురంలోని గుంతకల్లులో ఈ రోజు జనసేన పార్టీ... కార్యకర్తల సమావేశం నిర్వహించింది. అయితే, ఈ సందర్భంగా కొందరు పవన్‌ కల్యాణ్ అభిమానులు ఒక్కసారిగా సమావేశంలోకి దూసుకువచ్చి రచ్చ రచ్చ చేశారు. జనసేన నేతలు సమావేశంలో మాట్లాడుతుండగా వచ్చి సమావేశాన్ని అడ్డుకున్నారు. తమను ఈ సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని నిలదీశారు. దీంతో గొడవ చెలరేగడంతో అక్కడ ఉన్న కుర్చీలు, ఫర్నిచర్‌ను పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.   
Go Back to Shorts
Jana Sena
Pawan Kalyan
Anantapur District

More Telugu News