ఏపీలో కొలువుల జాతర.. 10,351 పోస్టులకు నోటిఫికేషన్లు
- డీఎస్సీ, టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- మే 4న టెట్ నోటిఫికేషన్
- జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్
మే 5 నుంచి 22 వరకు టెట్ దరఖాస్తులను స్వీకరిస్తారని చెప్పారు. జూన్ 3 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ అవుతాయని తెలిపారు. జూన్ 10 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. టెట్ అభ్యర్థులకు మాక్ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు. జులై 7 నుంచి డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తామని గంటా తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా ఆన్ లైన్ లో డీఎస్సీని నిర్వహిస్తామని చెప్పారు.