చైనా పర్యటనలో ఉన్న మోదీకి రాహుల్ గాంధీ ట్వీట్
- చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ
- మోదీ పర్యటనకు ఎజెండా లేదంటూ రాహుల్ ఎద్దేవా
- డోక్లాం, చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ గురించి మాట్లాడాలంటూ హితవు
'డియర్ ప్రైమ్ మినిష్టర్,
చైనాలో మీరు చేపట్టిన 'ఎజెండా లేని' పర్యటన గురించి లైవ్ టీవీ ఫీడ్ చూశా.
మీరు చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు.
మీకు కొన్ని గుర్తు చేస్తున్నాను.
1. డోక్లాం.
2. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పీఓకే గుండా వెళుతోంది. అది భారతదేశ భూభాగం.
మీరు ఈ విషయాలపై మాట్లాడతారని దేశం ఆశతో ఉంది.
మీకు మా మద్దతు ఉంటుంది'