bjp: నోరు అదుపులో పెట్టుకోవాలని మోదీ సూచించిన రెండు రోజులకే... మమతను శూర్పణఖతో పోల్చిన బీజేపీ నేత

షార్ట్స్‌లో చూడండి
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరును అదుపులో ఉంచుకోవాలని, ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మసలుకోవాలని ప్రధాని మోదీ హితవు పలికిన రెండు రోజులకే యూపీ బీజేపీ నేత దాన్ని తుంగలో తొక్కారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని రావణాసురుడి సోదరి సూర్పణఖతో పోల్చారు. యూపీలోని బైరియా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ సర్కారు హయాంలో హిందువులపై దాడులు జరుగుతుండడంతో విమర్శలకు దిగారు. హింస జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు.

‘‘మమతా బెనర్జీ సూర్పణఖ పాత్రను పోషిస్తున్నారు. వీధుల్లో ప్రజలను చంపుతున్నా ముఖ్యమంత్రిగా ఆమె ఏమీ చేయడం లేదు. బెంగాల్లో హిందువులకు రక్షణ లేదు. ఇలానే వదిలేస్తే పరిస్థితి జమ్మూ కశ్మీర్ తరహాలో మారిపోతుంది. జమ్మూ కశ్మీర్ నుంచి హిందువులు వలస వెళ్లిన పరిస్థితే పశ్చిమబెంగాల్లోనూ ఏర్పడుతుంది’’ అని సురేంద్ర సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రావణ పాత్రను పోషిస్తుందని విమర్శించారు.
Go Back to Shorts
bjp
modi
mamata banerjee

More Telugu News