కోర్టులోనే గొడ్డలితో భార్యను హతమార్చిన భర్త!
- విభేదాల నేపథ్యంలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగీత చౌదరి
- కౌన్సిలింగ్ కు హాజరు కావాలని ఆదేశించిన న్యాయస్థానం
- కౌన్సిలింగ్ చేస్తుండగా వాగ్వాదం, గొడ్డలితో దాడి
కోర్టు ఆదేశాల నేపథ్యంలో దంపతులిద్దరూ కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. వారికి న్యాయమూర్తులు కౌన్సిలింగ్ చేస్తుండగా, ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో వాగ్వాదం కారణంగా ఆగ్రహానికి గురైన రమేష్ తనతో తెచ్చుకున్న గొడ్డలితో భార్య, ఆమె తల్లి లలిత, ఆమె అక్క కుమార్తె శివాని (4) పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సంగీతను న్యాయమూర్తులు బుర్లా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. దాడి చేసిన వెంటనే పోలీసులు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు.