మళ్లీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
- నాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చేందుకు పాటుపడతా
- పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు
- బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓటమిపాలు కావడమే మా ప్రధాన ధ్యేయం
అనంతరం, మీడియాతో సీతారాం ఏచూరి మాట్లాడుతూ, తనపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చేందుకు పాటుపడతానని అన్నారు. పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, తామంతా ఏకతాటిపై నడుస్తున్నామని చెప్పారు. పార్టీ ఐక్యతను మహాసభలు మరోసారి రుజువు చేశాయని చెప్పిన ఆయన, దోపిడీ లేని సమాజం కోసం సమరశీల పోరాటాలు చేద్దామని, పెను సవాళ్లకు, దాడులకు ఎదురొడ్డి దేశ సమగ్రతను కాపాడుకుందామని పిలుపు నిచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓటమిపాలు కావడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.