అమాంతం కూలిపోయిన రెండంతస్తుల బిల్డింగ్‌

  • ఆగ్రా తాజ్‌గంజ్‌ ప్రాంతంలో ఘటన
  • పురాతన కాలానికి చెందిన భవనం
  • తప్పిన ప్రాణనష్టం
రెండంతస్తుల బిల్డింగ్‌ ఒక్కసారిగా కూలిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా తాజ్‌గంజ్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆ భవనం పురాతన కాలానికి చెందిందని అందులో ఎవ్వరూ ఉండడం లేదని తెలిసింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ భవనం వద్ద గానీ, దాని చుట్టుపక్కల గానీ ఎవ్వరూ లేరని, దీంతో ప్రాణనష్టం తప్పిందని అన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పురపాలక సిబ్బంది శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. భవనం కూలిపోతున్న దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కాయి.  
Go Back to Shorts
agra
Uttar Pradesh
building

More Telugu News