sri reddy: పెళ్లి కాని శ్రీరెడ్డీ, నీకు ఇంత పెద్ద కూతురు ఎలా వచ్చింది?... ఆ డబ్బు ఎలా వచ్చింది?: కరాటే కల్యాణి ప్రశ్న

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ లో పెనుదుమారానికి కారణమైన శ్రీరెడ్డిపై కరాటే కల్యాణి ఫేస్ బుక్ యుద్ధం ప్రారంభించింది. 'శ్రీరెడ్డి లీక్స్' పేరిట కొన్ని ఫొటోలను పోస్టు చేసి, శ్రీరెడ్డి టాలీవుడ్ లో కలకలం రేపినట్టే.. కల్యాణి కూడా కొన్ని ఫొటోలు పోస్టు చేసింది. ఈ సందర్భంగా ఆమె వాటిపై స్పందిస్తూ, ‘కల్యాణి లీక్స్ (truths) మొదలయ్యాయి. పెళ్లి కాని విమల (శ్రీరెడ్డి) కు ఇంత పెద్ద కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె విజయవాడ శ్రీ చైతన్యలో ఇంటర్ చదువుతోంది. మొన్ననే ఆ చదువు కూడా పూర్తైపోయింది.

విమల (శ్రీరెడ్డి) కు కుటుంబంతో 10 సంవత్సరాల నుండి సంబంధం లేకపోతే కొంత కాలం క్రిందట కూకట్‌ పల్లిలో లోథా మెరిడియన్‌లో కోటిన్నర విలువగల ఫ్లాట్ లో, తల్లితో కలిసి ఎలా గృహప్రవేశం చేసింది? ఖరీదైన కార్లలో తిరగడానికి, ఆ ఫ్లాట్ కొనడానికి డబ్బులెలా వచ్చాయో ఏంటో విమలా నీకే తెలియాలి. ఇంకొన్ని విషయాలను నాకు నచ్చినప్పుడు లీక్ చేస్తాను. ఎందుకంటే నా లీక్స్ నా ఇష్టం’’ అంటూ కరాటే కల్యాణి పేర్కొంది.
Go Back to Shorts
sri reddy
vimala
karate kalyani
Tollywood

More Telugu News