ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును ప్రస్తావించిన కర్ణాటక ముఖ్యమంత్రి
- ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ ప్రామిస్ చేశారు
- చివరకు హోదాను, చంద్రబాబును తొక్కేసే ప్రయత్నం చేశారు
- మనకు కూడా మోదీ ఎన్నో హామీలు ఇస్తారు
'ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హాదా ఇస్తామంటూ మోదీ ప్రామిస్ చేశారు... అయితే, చివరకు ప్రత్యేక హోదాతో పాటు చంద్రబాబును కూడా తొక్కేసే ప్రయత్నం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ తరహాలో మన రాష్ట్రానికి కూడా ఎలాంటి హామీలనైనా ఇవ్వడానికి మోదీ ఏమాత్రం సంశయించడం లేదని చెప్పారు. ఇప్పటికే బెంగళూరు గర్వించదగ్గ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నుంచి రాఫెల్ కాంట్రాక్టును ఇతర ప్రాంతానికి తరలించారు' అంటూ ట్వీట్ చేశారు. తద్వారా మోదీ ఇచ్చే హామీలను కర్ణాటక ఓటర్లు నమ్మవద్దని కోరారు.