abhishik bachan: నెటిజన్ చిరాకు ప్రశ్న.. ప్రశాంతంగా సమాధానం చెప్పిన అభిషేక్!

షార్ట్స్‌లో చూడండి
సినీ నటులను ఆకర్షించేందుకు కొందరు విమర్శల బాటపడుతుంటారు. మరికొందరు కావాలనే విమర్శిస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ను ఒక నెటిజన్ చిరాకు పుట్టించే ప్రశ్న అడిగాడు. దానికి చోటా బచ్చన్ ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. దాని వివరాల్లోకి వెళ్తే... వివాహమైన తరువాత కూడా భార్యా పిల్లలతో కలిసి వేరే ఇంట్లో ఉండకుండా ఇంకా తల్లిదండ్రులతోనే కలిసే ఉంటున్నారేమిటంటూ ఒక నెటిజన్ విమర్శించాడు.

 దీనికి ఆయన సమాధానమిస్తూ, ‘అవును. ఒకప్పుడు వారు నాకు తోడుగా నిలిచినట్లే నేనూ వారితో కలిసి వారికి తోడుగా ఉంటున్నందుకు గర్వంగా ఉంది. మీరు కూడా ప్రయత్నించి చూడండి. ప్రశాంతంగా ఉంటుంది’ అంటూ సమాధానం చెప్పాడు. దీనికి మరో అభిమాని స్పందిస్తూ, ‘మీరు ఎందుకు స్పందిస్తున్నారు సర్‌? మీ దృష్టి వారిపై పడాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు’ అంటూ వారిపై మండిపడ్డారు. అతనికి అభిషేక్ సమాధానమిస్తూ, ‘అప్పుడప్పుడు వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి’ అని అన్నాడు.
Go Back to Shorts
abhishik bachan
Twitter
Bollywood

More Telugu News