నాకు కులగజ్జి లేదు.. నా భార్య గౌడ కులస్తురాలు!: హీరో శివాజీ
- నా భార్య మహా గుణవంతురాలు
- ఆమెది హైదరాబాద్
- ఆమెది బీసీ, గౌడ కులస్తురాలు
- నా కుల ప్రస్తావన తెస్తూ తిట్టేవారి కోసం చెబుతున్నాను
"కోమట్లు చాలా మంచి వారు. ఐలయ్య గారు చెప్పింది మాత్రం ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఆయన మాటలను నేను ఖండించలేను. మా ఊరిలో కోమట్లు చాలా మంచివారు. మా నర్సరావుపేటలో ఒక రకంగా కోమట్లు అందరినీ సమయానికి ఆదుకునేవారు. వారంటే నాకు చాలా గౌరవం. మా నాన్నకి ఆంజనేయులు అని ఒకరు చాలా క్లోజ్. వారి దగ్గర బట్టలు కూడా కొనుక్కునే వాళ్లం. డబ్బులు మాత్రం తర్వాత ఇచ్చేవాళ్లం.
ఆయన వారి ఇంటికి పిలిచి మాకు భోజనం పెట్టేవారు. ఆ సమయంలో మాకు గోల్డ్ స్పాట్ (కూల్ డ్రింక్) ఇచ్చేవారు. ఇప్పుడు ఆ కూల్ డ్రింక్ లేదు. గోల్డ్ స్పాట్ కోసం మేము ఆయన ఇంటికి వెళదామని మా నాన్నతో అనే వాళ్లం. మా నాన్న 2006లో హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. మా అమ్మని నాన్న కొంచం కూడా కష్టపెట్టలేదు. మా ఊరిలో ఇరవై ఎకరాల పొలం కొనుక్కున్నాను. పొలం కొనాలనేది మా నాన్న కల" అని శివాజీ అన్నారు.