భాగస్వామి అంటే మా ఆయనలా వుండాలి!: సుర్వీన్ చావ్లా
Add ap7am to your home Screen

భాగస్వామి అంటే మా ఆయనలా వుండాలి!: సుర్వీన్ చావ్లా

  • లిప్ లాక్, హాట్ సీన్స్ కి అభ్యంతరం లేదు
  • పెళ్లైనంత మాత్రాన సినిమాలకు విరామం ఎందుకు? 
  • మంచి స్క్రిప్ట్‌ దొరికితే సినిమా చేయమని నా భర్తే చెబుతారు
స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేస్తే సహ నటుడిని ముద్దు పెట్టుకోవడానికి, హాట్ సీన్స్ లో కనిపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా తెలిపింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన భర్త తన వృత్తిని ఎంతో గౌరవించి, ప్రోత్సహిస్తారని తెలిపింది. జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి? అని ఆమె ప్రశ్నించింది.

పెళ్లైనంత మాత్రాన సినిమాలకు విరామం తీసుకోవాలన్న రూల్ లేదు కదా? అని అడిగింది. ఇప్పటికిప్పుడు మంచి స్క్రిప్ట్‌ దొరికితే ఆ సినిమా చేయమని తన భర్తే చెబుతారని సుర్వీన్ చావ్లా తెలిపింది. భాగస్వామి అంటే అలా ఉండాలని తన భర్తను ఆకాశానికెత్తింది. ‘హేట్‌ స్టోరీ 2’, ‘పార్చ్‌డ్‌’ సినిమాలతో బాలీవుడ్ ను ఆకట్టుకున్న సుర్వీన్‌ చావ్లా, ‘రాజు మహారాజు’ సినిమాలో శర్వానంద్‌ కి జోడీగా నటించింది.
survin chavla
lip lock
nude scane
Bollywood

More Telugu News