నటి జీవిత వ్యాఖ్యలపై స్పందించిన సామాజిక కార్యకర్త సంధ్య
- నా వ్యాఖ్యలకు తగిన ఆధారాలు ఉన్నాయి
- బాధిత యువతులే నా దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు
- ఇది జీవితకు, నాకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు
- కేసును న్యాయపరంగా ఎదుర్కొంటా
ఇది కేవలం జీవితకు, తనకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదని చెప్పిన సంధ్య, సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ లేదని, కమిట్ మెంట్ సిస్టమ్ లేదని జీవిత మాట్లాడటం కరెక్టు కాదనే దృష్టితోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, జీవిత అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని, తమ పోరాటం ఎప్పుడూ బాధిత మహిళల పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు.