ఎద్దేవా చేసిన నెటిజన్ కు దీటైన సమాధానం చెప్పిన తాప్సీ!

  • ‘మన్మర్జియా’ సినిమాలో నటిస్తున్న తాప్సీ
  • స్నాక్స్ తింటున్న ఫొటో పోస్టు చేసిన ముద్దుగుమ్మ 
  • నువ్వేమీ అందగత్తెవు కావంటూ నెటిజన్ కామెంట్ 
తన అందంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన నెటిజన్‌ కి దీటైన సమాధానం ఇచ్చి శభాష్ అనిపించుకుంది తాప్సీ. దాని వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం తాప్సీ ‘మన్మర్జియా’ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తో పిచ్చాపాటి మాట్లాడుతూ, స్నాక్స్ తింటున్న ఫొటోను ట్వీట్ చేసింది.

దీనిని చూసిన హర్జోత్‌ సింగ్‌ అనే నెటిజన్‌ ఆమెను ఎద్దేవా చేస్తూ, ‘అసలు నిన్ను హీరోయిన్‌ ని చేసిందెవరు? నువ్వు చూడ్డానికి యావరేజ్‌ గా ఉంటావ్’ అంటూ వ్యాఖ్యానించాడు. దానికి ఏమాత్రం నొచ్చుకోని తాప్సీ ‘బహుశా వాళ్లు నా నటన చూసి అవకాశం ఇచ్చి ఉంటారు. యావరేజ్‌ గా ఉండటంలో తప్పేం లేదు కదా? ప్రపంచంలో ‘యావరేజ్’ అనేది అతిపెద్ద కేటగిరీ’ అంటూ దీటైన జావాబిచ్చి అతని నోరు మూయించింది.
Go Back to Shorts
tapsi
tapsi pannu
Twitter
netizen
comments

More Telugu News