ధోనీ బ్యాటింగ్ సమయంలో 'నాన్నని హత్తుకోవాలి..ఇప్పుడే' అంటున్న జివా.. వైరల్ వీడియో!
- కింగ్స్ ఎలెవన్ పంజాబ్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్
- గ్యాలరీలోంచి మ్యాచ్ వీక్షించిన ధోనీ కుమార్తె
- మ్యాచ్ మధ్యలో తండ్రిని పిలవాలని కోరిన జివా
ఎందుకు? అని అడిగితే.. ప్రేమతో హత్తుకుంటానని చెప్పింది. తండ్రిని ఇప్పుడే పిలవాలని కోరింది. దీనికి సంబంధించిన వీడియోను ధోనీ తన ఇన్ స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘నేను మైదానంలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జీవాకి నన్ను హత్తుకోవాలనిపించింది’ అంటూ ఆ వీడియోని పరిచయం చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో ధోనీ సేన ఓటమిపాలైన సంగతి తెలిసిందే.