కథువా, ఉన్నావో ఘటనలపై కదిలిన బాలీవుడ్!
Add ap7am to your home Screen

కథువా, ఉన్నావో ఘటనలపై కదిలిన బాలీవుడ్!

  • బాధితులకు న్యాయం కోసం బాలీవుడ్ డిమాండ్
  • ముంబైలోని కార్టర్ రోడ్ లో ఆందోళన
  • నినాదాలతో హోరెత్తిన రహదారి 
ఉన్నావో‌, కథువా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలీవుడ్‌ కదిలింది. ముంబైలోని కార్టర్ రోడ్ లో బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో సినీ నటి, రచయిత్రి ట్వింకిల్‌ ఖన్నా, సమీరా రెడ్డి, రాజ్‌ కుమార్‌ రావ్‌, పత్ర లేఖ, సీనియర్ నటి హెలెన్‌, నిర్మాత ఏక్తా కపూర్‌, అమైరా దస్తూర్‌, కల్కీ కొచ్లిన్‌, విశాల్‌ దద్లానీ, అదితి రావ్‌ హైదరీ తదితరులు ‘న్యాయం జరగాలి’ అన్న ప్లకార్డులు పట్టుకుని పాల్గొన్నారు.

వారికి అభిమానులు, యువకులు తోడయ్యారు. దీంతో ఆ ప్రాంతమంతా 'జస్టిస్ ఫర్ అసిఫా' అన్న నినాదాలతో హోరెత్తింది. ఇంకా ఎంతకాలం ఇలా మౌనంగా ఉంటామంటూ పలువురు ప్రశ్నించారు. ఇప్పుడే న్యాయం జరగాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
Bollywood
actors
actresess
protest

More Telugu News