'భరత్ అనే నేను'లో హైలైట్స్ .. ఈ మాత్రం షేర్ రాబట్టాలి

  • విడుదలకి సిద్ధంగా 'భరత్ అనే నేను'
  • ఆ రెండు సీన్స్ హైలైట్ 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి          
కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా రూపొందింది. మహేశ్ బాబు .. కైరా అద్వాని జంటగా నటించిన ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఈ రోజు కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్..లింగంపల్లిలోని ఓ థియేటర్లో చిత్రీకరించిన ఫైట్ సీన్ .. ముఖ్యమంత్రిగా మహేశ్ పాల్గొన్న అసెంబ్లీ సీన్ ఈ సినిమా హైలైట్స్ గా నిలుస్తాయనీ .. ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తాయని అంటున్నారు.

 ఇక 'రంగస్థలం' సినిమా రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక 'భరత్ అనే నేను' అమ్మకాలను బట్టి చూసుకుంటే, రెండు వారాల్లో ఈ సినిమా 110 కోట్ల షేర్ ను రాబట్టవలసి ఉంటుందని అంటున్నారు. మరి 'భరత్ అనే నేను' ఆ స్థాయిలో దూసుకెళ్లి కొత్త రికార్డులను సృష్టిస్తుందేమో చూడాలి.     
Go Back to Shorts
Mahesh Babu
kiara advani

More Telugu News