హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందిన అంధుడు!
- గ్లకోమా కారణంగా చూపు కోల్పోయిన బ్రహ్మానంద శర్మ
- మేజిస్ట్రేట్ నియామక పరీక్షలో 83వ ర్యాంకు సాధించిన వైనం
- రాజస్థాన్ హైకోర్టు జడ్జీగా నియామకం
హైకోర్టు జడ్జ్ కావాలన్న లక్ష్యంతో తీవ్రంగా చదివేవారు. అది సరిపోదని భావించి వివిధ కోచింగ్ సెంటర్లను ఆశ్రయించగా, అంధత్వం కారణంగా తనకు శిక్షణ ఇచ్చేందుకు నిరాకరించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన భార్య సహకారంతో తాను జడ్జీని కాగలిగానని ఆయన చెప్పారు. తాను మేజిస్ట్రేట్ గా ఉన్నప్పుడు ఒక అంధుడు తమకు ఎలా న్యాయం చేస్తాడని పలువురు అనుమానం వ్యక్తం చేసేవారని, అయితే తాను మాత్రం నిజానిజాలను పరిశీలించి కేసులు పరిష్కరించేవాడినని ఆయన చెప్పారు.