gold: పెరిగిన బంగారం, వెండి ధరలు

షార్ట్స్‌లో చూడండి
అక్షయ తృతీయ నేపథ్యంలో పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు నిన్న బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. నిన్న అమాంతం రూ.350 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ. 31,800కి చేరి, ఈ రోజు మళ్లీ పెరిగింది. అంతర్జాతీయంగా పెట్టుబడులు పెరగడం, స్థానిక ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్ అధికమవ్వడంతో ఈ రోజు పసిడి ధర రూ.300 పెరిగి, 10 గ్రాముల బంగారం ధర రూ. 32,100గా నమోదైంది. మరోవైపు నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర కూడా రూ. 250 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 40వేలకు చేరింది.
Go Back to Shorts
gold
silver
rates

More Telugu News