'ఆమ్రపాలి' సంస్థపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ధోనీ, భువీ, రాహుల్, డుప్లెసిస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆమ్రపాలి' సంస్థపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ధోనీ, భువీ, రాహుల్, డుప్లెసిస్

  • ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాడర్ గా పని చేసిన ధోనీ, కేఎల్ రాహుల్, డుప్లెసిస్
  • క్రికెటర్లకు బ్రాండింగ్, మార్కెటింగ్ డబ్బులు చెల్లించని సంస్థ
  • 200 కోట్ల రూపాయల మేర క్రికెటర్లకు బాకీ 
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలిపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఢిల్లీ హైకోర్టులో న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు చెల్లించాల్సిన 150 కోట్ల రూపాయలు చెల్లించలేదని ధోనీ దావా వేశాడు. ధోనీతో పాటు కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, డుప్లెసిస్ కూడా ఈ సంస్థపై ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యకలాపాలకోసం తమకు చెల్లింపులు చేయలేదని వారు పిటిషన్ లో పేర్కొన్నారు.

 ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థ క్రికెటర్లకు 200 కోట్ల రూపాయల మేర బకాయిలు పడిందని రితి స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ పాండే తెలిపారు. కాగా, ఈ రియల్ ఎస్టేట్ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వివిధ పట్టణాల్లో చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోతోంది. దీంతో పలువురు వినియోగదారులు ఈ సంస్థను దుమ్మెత్తిపోస్తూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు వినియోగదారులు ధోనీని ట్యాగ్ చేస్తూ పలు ట్వీట్లు చేశారు. దీంతో 2016లో ధోనీ ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
Amrapali
Real Estate
MS Dhoni
kl rahul
fe du plesis

More Telugu News