Gundey: దొంగిలించిన వాహనాలతో షూటింగ్... రుణవీర్ సింగ్, అర్జున్ సింగ్ సినిమాలో కనిపించాయని తేల్చిన పోలీసులు!

షార్ట్స్‌లో చూడండి
రణవీర్‌ సింగ్, అర్జున్‌ కపూర్ ప్రధాన పాత్రధారులుగా గతంలో వచ్చిన 'గూండే' చిత్రంలో దొంగిలించబడిన ఓ వాహనాన్ని వినియోగించారని ముంబై పోలీసులు తేల్చారు. మరిన్ని కథనాల్లోకి వెళితే, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఇటీవల ఓ హత్య కేసు విచారణలో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అతను వాహనాలను దొంగిలించి, వాటి పరికరాలను మార్చి విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ హై ఎండ్ బైక్ ను తీసుకుని మార్చాడు.

ఆ వాహనాన్ని 'గూండే' సినిమాలో వాడారని అతను చెప్పడంతో చిత్రబృందాన్ని పోలీసులు విచారిస్తున్నారు. 'గూండే'తో పాటు 'గోల్ మాల్' సినిమాలోనూ దొంగిలించిన వాహనాలను వాడారని తెలుస్తోంది. ఇక మరో ముగ్గురితో కలసి నిందితుడు దాదాపు 100 వాహనాలను చోరీ చేసి అమ్మినట్టు పోలీసులు తేల్చారు. ఈ వాహనాలను సినిమా వాళ్లే స్వయంగా కొన్నారా? లేక నిందితులు వాటిని ఎవరికైనా విక్రయిస్తే వారు సినిమా యూనిట్ కు విక్రయించారా? అనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు.
Go Back to Shorts
Gundey
Golmaal
Theft
Mumbai Crime Branch
two wheelers

More Telugu News