కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. సిక్కోలు జవాను వీర మరణం
- రెండు నెలల క్రితమే సెలవుపై ఇంటికొచ్చిన జవాను
- అంతలోనే ఉగ్రవాదుల తూటాలకు బలి
- కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
గుణకరరావు మృతి వార్త తెలియడంతో స్వగ్రామం ఏఎస్ కవిటిలో విషాద ఛాయలు అలముకున్నాయి. రెండు నెలల కిందటే సెలవుపై ఇంటికి వచ్చిన గుణకరరావుకు త్వరలోనే పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అంతలోనే అతడి మరణవార్త ఆ కుటుంబంలో విషాదం నింపింది. గుణకరరావు మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.