Kodandaram: 100 సీట్లు గెలుస్తామన్న టీఆర్ఎస్‌ నేతల గుండెల్లో ఇప్పుడు భయమెందుకు?: ప్రొ.కోదండరామ్‌

షార్ట్స్‌లో చూడండి
టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొ.కోదండరామ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలంగాణ జన సమితి ఈ నెల 29న హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించాలనుకుంటుండగా అందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కోదండరామ్‌ మండిపడ్డారు. తెలంగాణ సర్కారు తమ సభకు అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా తాము నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎప్పుడు సభ నిర్వహించాలని చూసినా ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. తమ సభకు అనుమతి ఎందుకు ఇవ్వరని నిలదీశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామన్న టీఆర్ఎస్‌ ఎందుకు భయపడుతుతోందని, ఆ పార్టీ నేతల గుండెల్లో భయముందని తెలుస్తోందని కోదండరామ్‌ వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Kodandaram
TRS
Telangana Jana Samithi

More Telugu News