కనీసం 2 కిలోమీటర్లయినా నడిచినందుకు పవన్‌ కల్యాణ్‌ని అభినందిస్తున్నాను: రోజా సెటైర్
Add ap7am to your home Screen

కనీసం 2 కిలోమీటర్లయినా నడిచినందుకు పవన్‌ కల్యాణ్‌ని అభినందిస్తున్నాను: రోజా సెటైర్

  • పదేళ్లు హోదా ఇస్తామని తిరుపతిలో మోదీ అన్నారు
  • పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలని చంద్రబాబు అన్నారు
  • వారిని తాను ప్రశ్నిస్తానని పవన్ అన్నారు
  • చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు
విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను, ప్రత్యేక హోదాను సాధించుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు ఆమె హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... నాలుగేళ్లు నిద్రపోయిన చంద్రబాబు ఇప్పుడు నిద్రలేచారని, అయినప్పటికీ ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

వైసీపీ చేస్తోన్న దీక్షల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు డ్రామాలాడుతున్నారని, ఏప్రిల్‌ 30న తిరుపతిలో ఓ సదస్సు నిర్వహిస్తామని చంద్రబాబు అంటున్నారని, ప్రజలను మళ్లీ ఏప్రిల్ ఫూల్స్‌ చేయాలని చూస్తున్నారని రోజా అన్నారు. అదే తిరుపతిలో పదేళ్లు హోదా ఇస్తామని మోదీ అంటే పదేళ్లు కాదు, పదిహేనేళ్లు కావాలని చంద్రబాబు అన్నారని, వారిద్దరు మాట మీద నిలబడకపోతే తాను ప్రశ్నిస్తానని పవన్ కల్యాణ్ అన్నారని రోజా వ్యాఖ్యానించారు. ఇటీవల పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా మీద పోరాటం అంటూ కనీసం రెండు కిలోమీటర్లయినా నడిచినందుకు అభినందిస్తున్నానని సెటైర్ వేశారు.   
roja
Tirupati
YSRCP
Pawan Kalyan

More Telugu News