cricketer shami: క్రికెటర్ షమీ నుంచి నెలనెలా రూ.10 లక్షల భరణం కోసం భార్య హసిన్ డిమాండ్

షార్ట్స్‌లో చూడండి
క్రికెటర్ షమీ తనను వేధిస్తున్నాడంటూ, అతనికి అనైతిక సంబంధాలున్నాయంటూ కోర్టుకెక్కిన అతని భార్య హసిన్ జహాన్... చివరికి భరణం కోసం డిమాండ్ చేశారు. ప్రతీ నెలా తనకు షమీ నుంచి రూ.10 లక్షలను నిర్వహణ ఖర్చుల కింద ఇప్పించాలని కోరారు. ‘‘నేను నష్టపోయాను. ఢిల్లీకి వచ్చి షమీ కోసం ఏడు రోజులు వేచి చూశా. కానీ, అతడు నా పట్ల ప్రవర్తించిన విధానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. తను నా కుమార్తెను ఒక్కసారే కలిశాడు. అతడు ఎటువంటి బాధ్యతలు తీసుకోనేందుకు సుముఖంగా లేనందున నాకు మెయింటెనెన్స్ ఇప్పించాలి’’ అని ఆమె కోరారు.

పశ్చిమబెంగాల్ లోని అలిపోర్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో షమీకి వ్యతిరేకంగా హసిన్ గృహ హింస నిరోధక చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. ఇదే కోర్టులో ఆమె తాజాగా భరణం కోరుతూ మరో పిటిషన్ వేశారు. షమీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం మొదలు పెట్టిన తర్వాత అతడు భార్యకు రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఖర్చులకు ఇబ్బంది పడతున్నట్టు ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏటా రూ.100 కోట్లు సంపాదిస్తున్న షమీ నెలకు రూ.10 లక్షలు ఇవ్వడం భారం కాబోదన్నారు. కుటుంబ పోషణ చూసుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉందని, కనుక హసిన్ కు రూ.7 లక్షలు, కుమార్తెకు రూ.3 లక్షల చొప్పున ప్రతీ నెలా ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
Go Back to Shorts
cricketer shami
wife

More Telugu News