Pawan Kalyan: సీపీఐ ఏపీ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రామకృష్ణకు అభినందనలు : పవన్ కల్యాణ్
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ.) ఆంధ్రప్రదేశ్ శాఖకు కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె.రామకృష్ణకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ తరపున, తన తరపున, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. సీపీఐ ఏపీ శాఖ కార్యవర్గానికి ఎన్నికైన ఇతర సభ్యులకు శుభాభినందనలు తెలుపుతున్నానని, రామకృష్ణ నాయకత్వంలో ఏపీలో అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన తనవంతు సహకారం అందిస్తుందని మరోసారి హామీ ఇస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు.