vishnu kumar raj: ‘పట్టిసీమ’లో భారీ అవినీతి జరిగింది : విష్ణుకుమార్ రాజు

షార్ట్స్‌లో చూడండి
పట్టిసీమ ప్రాజెక్టు విషయమై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి అవినీతి ఆరోపణలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పేరిట రూ.320 కోట్ల అవినీతి జరిగిందని, ఇంకా లోతుగా వెళితే ఆ అవినీతి రూ.420 కోట్ల వరకు ఉంటుందని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు అద్భుతమైందనే మాటకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పిన ఆయన, సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఏపీకి ఎప్పటిలాగానే కేంద్రం నుంచి నిధులు వస్తాయని చెప్పారు. కాగా, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయ క్రీడ నడుస్తోందని, టీడీపీ, ఇతర పార్టీలు బీజేపీపై నిందలు వేస్తూ నికృష్ట స్థాయికి చేరాయని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి టీడీపీ పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.


 
Go Back to Shorts
vishnu kumar raj
bjp

More Telugu News